CM KCR: తెలంగాణ సీఎం అత్యవసర సమీక్ష.. మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం

telanga CM review meeting with officilas today
  • కరోనా కేసుల విస్తరణ, నివారణ అంశాలపై చర్చ
  • రేపు కేబినెట్ సమావేశంలో నిర్ణయాల పైనా...
  •  హాజరు కావాలని పలు విభాగాల అధికారులకు సమాచారం
తెలంగాణలో కరోనా వైరస్ విస్తరిస్తుండడం, కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. రేపు కేబినెట్ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ సమీక్షా సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ సమీక్షకు హాజరు కావాల్సిందిగా వివిధ విభాగాల అధికారులకు ఇప్పటికే సమాచారం వెళ్లింది. కరోనా కట్టడికి తీసుకునే చర్యలతోపాటు, రేపు కేబినెట్ సమావేశంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు, 20వ తేదీ తర్వాత లాక్ డౌన్ కు సడలింపు ఇవ్వాలన్న అంశాలపైనా చర్చించే అవకాశం ఉంది.
CM KCR
review meeting
Corona Virus

More Telugu News