Pavan kalyan: 'వకీల్ సాబ్' కోసం కోర్టు సెట్ .. 25 రోజుల పాటు షూటింగ్

  • 75 శాతం చిత్రీకరణ జరుపుకున్న 'వకీల్ సాబ్'
  • అన్నపూర్ణ స్టూడియోలో కోర్టు సెట్
  • అభిమానుల్లో పెరుగుతున్న ఆసక్తి
Vakeel Saab Movie

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' రూపొందుతోంది. 'దిల్' రాజు నిర్మిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఇంకా 25 రోజులపాటు చిత్రీకరణ జరిపితే, ఈ సినిమా షూటింగు పూర్తవుతుందని అంటున్నారు.

అన్నపూర్ణ స్టూడియోలో కోర్టు సెట్ వేశారట. మిగిలిన భాగంలో చాలా వరకూ ఈ సెట్ లోనే చిత్రీకరించనున్నట్టు సమాచారం. ఆ తరువాత ఒక పాటను చిత్రీకరిస్తారని చెబుతున్నారు. దాంతో ఈ సినిమా షూటింగు పూర్తవుతుంది. పవన్ అభిమానులంతా ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. హిందీ .. తమిళ భాషల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ కథ, తెలుగు ప్రేక్షకులకు ఎంతవరకూ కనెక్ట్ అవుతుందో చూడాలి.

More Telugu News