Chandramouli: కుప్పం వైసీపీ ఇన్ ఛార్జ్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి కన్నుమూత

YSRCP Kuppam incharge Chandramouli dead
  • గత ఎన్నికల్లో చంద్రబాబు  చేతిలో ఓటమి
  • ఎన్నికలకు ముందే అనారోగ్యానికి గురైన వైసీపీ నేత
  • సంతాపాన్ని ప్రకటించిన జగన్
చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి కన్నుమూశారు. హైదరాబాదులోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. చంద్రమౌళి మృతి పట్ల ముఖ్యమంత్రి జగన్, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి సంతాపాన్ని ప్రకటించారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటు అని చెప్పారు.

గత ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబుపై చంద్రమౌళి పోటీ చేశారు.  ఎన్నికలకు ముందే అనారోగ్యానికి గురైన ఆయన, ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆయన తరపున వైసీపీ నాయకులే నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల్లో చంద్రమౌళిపై చంద్రబాబు 30 వేలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు.
Chandramouli
YSRCP
Kuppam
Chandrababu
Jagan

More Telugu News