Guntur District: గుంటూరులో దారుణం.. పెళ్లికి పెద్దలు అంగీకరించరని ప్రేమ జంట ఆత్మహత్య

Lovers Suicide in Guntur
  • రెండు రోజులుగా ఇంటికి రాని యువతి
  • తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసుల దర్యాప్తు
  • సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గుర్తింపు
ప్రేమ వివాహాన్ని పెద్దలు అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. గుంటూరులో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. సదరు యువతి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తుండగా, యువకుడు ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్నాడు.

కాలేజీలో చదువుకుంటున్నప్పటి నుంచే వీరి మధ్య ప్రేమ చిగురించింది. కాగా, రెండు రోజులుగా యువతి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు యువతి సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆమె బ్రాడీపేటలో ఉన్నట్టు గుర్తించి అక్కడికి చేరుకున్నారు. అక్కడ యువతీయువకులు ఇద్దరూ విగతజీవులై కనిపించారు. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు.
Guntur District
Andhra Pradesh
Lovers
Suicide

More Telugu News