Gandhi Medical College: గాంధీ మెడికల్ కాలేజీలో భయాందోళనలు... డేటా ఎంట్రీ ఆపరేటర్ కు కరోనా పాజిటివ్

Fears in Gandhi Medical College due to staff tests corona positive
  • బాధితుడిని కలిసిన వారిలో ప్రొఫెసర్
  • భయాందోళనలో కాలేజీ సిబ్బంది
  • అందరికీ టెస్టులు నిర్వహిస్తున్న మెడికల్ స్టాఫ్
హైదరాబాదులోని గాంధీ మెడికల్ కాలేజీలో పని చేస్తున్న డేటీ ఎంట్రీ ఆపరేటర్ కు కరోనా పాజిటివ్ రావడంతో కలకలం రేగింది. బాధితుడిని కలిసిన వారిలో ఒక ప్రొఫెసర్ కూడా ఉండటంతో... మెడికల్ కాలేజీలో పని చేస్తున్న వారు కూడా భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో, మెడికల్ కాలేజీ సిబ్బందికి కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు.

మరోవైపు తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. మర్కజ్ ఉదంతం తర్వాత కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఆందోళనకర వాతావరణం ఉంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 726 కేసులు నమోదయ్యాయి. 18 మంది ప్రాణాలు కోల్పోయారు.
Gandhi Medical College
Corona Virus
Hyderabad

More Telugu News