Sensex: ఆర్బీఐ ఎఫెక్ట్.. భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 986 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 274 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 13 శాతానికి పైగా లాభపడ్డ యాక్సిస్ బ్యాంక్
Sensex gains 986 points

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలను మూటగట్టుకుని... ఈ వారాన్ని పాజిటివ్ గా ముగించాయి. వ్యవస్థలోకి నిధులను పంపేదిశగా ఆర్బీఐ ఈరోజు ప్రకటన చేయడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఈరోజు బ్యాంకింగ్ షేర్లు లాభాల్లో దూసుకుపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 986 పాయింట్లు లాభపడి 31,589కి పెరిగింది. నిఫ్టీ 274 పాయింట్లు పుంజుకుని 9,267కి ఎగబాకింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యాక్సిస్ బ్యాంక్ (13.45%), ఐసీఐసీఐ బ్యాంక్ (9.89%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (9.13%), మారుతి సుజుకి (8.64%), టీసీఎస్ (5.32%).

టాప్ లూజర్స్:
నెస్లే ఇండియా (-3.15%), హిందుస్థాన్ యూనిలీవర్ (-2.14%), టెక్ మహీంద్రా (-1.60%), సన్ ఫార్మా (-1.53%), టైటాన్ కంపెనీ (-1.18%).

More Telugu News