Nimmakayala Chinarajappa: ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత చినరాజప్ప విమర్శలు

TDP Leader China Rajappa criticises Cm Jagan
  • ప్రస్తుత  పరిస్థితుల్లో రాజధాని గురించి మాట్లాడటం అవసరమా? 
  • ‘కరోనా’ పరీక్షలకు సరిపడా ల్యాబ్స్ ఏర్పాటు చేయాలి
  • ‘కరోనా’ ఖర్చుల కింద పురపాలక సంఘాలకు నిధులు ఇవ్వాలి

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప విమర్శలు గుప్పించారు. ‘కరోనా’ వ్యాప్తి చెందకుండా చేపట్టాల్సిన చర్యలపై కాకుండా ఇతర విషయాలపై సీఎం శ్రద్ధ చూపుతుండటం తగదని అన్నారు.

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో రాజధాని అంశం గురించి మాట్లాడటం అవసరమా? అని ప్రశ్నించారు. ‘కరోనా’ పరీక్షలు నిర్వహించేందుకు సరిపడా ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ‘కరోనా’ బారినపడ్డ వారి కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వైద్య సేవలు చేస్తున్న వైద్యులకు వసతులు కల్పించకపోవడం దారుణమని విమర్శించారు. ‘కరోనా’ ఖర్చుల కింద పురపాలక సంఘాలకు నిధులు ఇవ్వాలని, వలస కూలీలకు వసతి, భోజన సదుపాయం కల్పించాలని సీఎం జగన్ ని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News