army: భారత్‌, పాక్ సరిహద్దుల వద్ద ఉద్రిక్తత.. ఉత్తర కశ్మీర్‌ వెళ్లి పరిస్థితి సమీక్షిస్తోన్న భారత ఆర్మీ చీఫ్

  • ఎల్‌ఓసీ వెంబడి భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య కాల్పుల మోత  
  • ఇటీవల ఐదుగురు జవాన్లు, ముగ్గురు పౌరుల మృతి
  • దీటుగా బదులిస్తోన్న భారత్
Army chief reviews security situation in Kashmir as LoC violations spike

ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా సెక్టారు వద్ద నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో భారత సైన్యాధిపతి నరవాణే రెండు రోజుల పర్యటన నిమిత్తం కశ్మీర్‌ చేరుకున్నారు. అక్కడి భద్రతా చర్యలపై సమీక్ష నిర్వహిస్తున్నారు.

ఇటీవల, ఆ ప్రాంతంలో పాకిస్థాన్‌ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. దీంతో ఐదుగురు పారా కమాండోలు, ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఉత్తర కశ్మీర్‌లోని పరిస్థితులపై నరవాణే దృష్టి సారించారు.

ఏప్రిల్‌ 5న కెరన్ సెక్టార్‌ నుంచి కశ్మీర్‌లోకి చొరబడాలని ప్రయత్నించిన ఉగ్రవాదులపై సైన్యం కాల్పులు జరిపింది. దీంతో ఉగ్రవాదులు చేసిన దాడిలో ఐదుగురు కమాండోలో వీర మరణం పొందారు. దీంతో, ఇందుకు ప్రతిగా ఏప్రిల్ 10న భారత ఆర్మీ కిరన్‌ సెక్టార్‌లో ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసింది.

నిన్న ఆర్మీ చీఫ్‌తో పాటు ఉత్తర ఆర్మీ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనర్ల్ వైకే జోషి, చినార్ కార్ప్స్ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్ బీఎస్‌ రాజు కూడా అక్కడి పరిస్థితులను సమీక్షించారు. దాడులను ఎదుర్కొనేందుకు, ఉగ్రవాదుల కుట్రలను తిప్పికొట్టేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆర్మీ చీఫ్ సూచించారు.

కాగా పాక్ కవ్వింపు చర్యలకు  భారత్ దీటుగా సమాధానం ఇస్తోంది. ప్రపంచమంతా కరోనా వైరస్‌పై పోరాడుతోన్న సమయంలోనూ పాక్ నియంత్రణ రేఖ వెంట ఇటువంటి చర్యలకు పాల్పడుతోంది. ఎల్‌ఓసీ వెంబడి భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య కాల్పుల మోత మోగుతోంది.

More Telugu News