Pawan Kalyan: కరోనాపై గబ్బర్‌ సింగ్‌ గ్యాంగ్ 'ర్యాప్ సాంగ్'.. ధన్యవాదాలు చెప్పిన పవన్ కల్యాణ్!

pawan about corona song
  • అలరిస్తోన్న గబ్బర్‌ సింగ్‌ గ్యాంగ్‌ పాట
  • ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషిచేస్తున్నారన్న పవన్
  • వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన పవర్‌ స్టార్
కరోనా విజృంభణ నేపథ్యంలో 'గబ్బర్ సింగ్' గ్యాంగ్ ఓ పాటను విడుదల చేసింది. దీనికి జనసేన కరోనా వైరస్‌ అవేర్‌నెస్‌ సాంగ్ అని పేరు పెట్టింది. కరోనాపై జాగ్రత్తలు చెబుతూ వారు పాడుతున్న పాట అలరిస్తోంది. దీనిపై పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్‌ ప్రశంసల జల్లు కురిపించారు.

'కరోనా పై ర్యాప్ సాంగ్ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషిచేస్తున్న "గబ్బర్ సింగ్" సినిమా నటులు సాయి బాబా, రమేష్, ప్రవీణ్, రాజశేఖర్, శంకర్, శ్రీకాంత్, ఉదయ్ కుమార్, సోమరాజ్, చంద్రశేఖర్, నరసింహ రెడ్డి గార్లకు, సింగర్ "మేఘా రాజ్", ఎడిటర్ "వేణు" మ్యూజిక్ డైరెక్టర్ "శ్రీ కోటి" గీత రచయిత "ప్రియాంక" గార్లకు, ఇతర సహాయక బృందానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు' అని ఆయన ట్వీట్లు చేశారు.

ఈ సందర్భంగా వారి పాటను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది కరోనాపై పాటలు పాడి జాగ్రత్తలపై అవగాహన కల్పించిన విషయం తెలిసిందే. గబ్బర్ సింగ్ సినిమా నటులు డ్యాన్స్ చేసిన ఈ పాట వైరల్‌ అవుతోంది. కరోనాపై అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, ఆ వైరస్‌పై జరుగుతోన్న యుద్ధంలో గెలుద్దామని ఆ పాట ద్వారా గబ్బర్ సింగ్‌ గ్యాంగ్‌ పిలుపునిచ్చింది.
Pawan Kalyan
Janasena
Tollywood
Corona Virus

More Telugu News