Amitabh Bachchan: తెలుగు సినీ కార్మికులకు రూ.1.80 కోట్ల విలువైన బిగ్ బజార్ ఓచర్లను పంపిన అమితాబ్!

Chiranjeevi Thanks to Amitab
  • లాక్ డౌన్ తో పూటగడవక ఇబ్బందులు
  • 12 వేల కూపన్లు పంపించిన అమితాబ్
  • కృతజ్ఞతలు తెలిపిన చిరంజీవి
లాక్ డౌన్ కారణంగా పని లేకుండా పోయి, పూట గడవక ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల్లోని రోజువారీ సినీ కార్మికుల కోసం అమితాబ్ బచ్చన్ రూ. 1.80 కోట్ల విలువైన బిగ్ బజార్ గిఫ్ట్ ఓచర్లను పంపించారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించిన మెగాస్టార్ చిరంజీవి, "అమితాబ్ గారు, ఒక్కొక్కటి రూ.1500 విలువైన 12 వేల రిలీఫ్ కూపన్లను తెలుగు రాష్ట్రాల్లోని రోజువారీ సినీ కార్మికుల కోసం పంపించారు. వాటిని డిస్ట్రిబ్యూట్ చేయనున్నాము. ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు 'బిగ్ బీ'కి బిగ్ థ్యాంక్స్. ఈ కూపన్లను బిగ్ బజార్ స్టోర్లలో రిడీమ్ చేసుకోవచ్చు" అని తెలిపారు.
Amitabh Bachchan
Chiranjeevi
Big Bazar
Coupons
Twitter

More Telugu News