Tamil Nadu: కరోనా ‘ధనవంతుల వ్యాధి’.. వారే దానిని తీసుకొచ్చారు: పళనిస్వామి సంచలన వ్యాఖ్యలు

  • ఈ వైరస్ ధనవంతులకే ఎక్కువగా సోకుతోంది
  •  ఇదేమీ రాష్ట్రంలో పుట్టలేదు
  • రాష్ట్రంలో నిన్న కొత్తగా 25 కేసుల నమోదు
Coronavirus is a disease of the rich says palanisamy

ప్రపంచాన్ని భయభ్రాంతుల్లోకి నెట్టేసిన కరోనా వైరస్‌‌ను తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ‘ధనవంతుల వ్యాధి’గా అభివర్ణించారు. ధనవంతులే దానిని రాష్ట్రంలోకి తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు. ఈ వైరస్ ఎక్కువగా ధనవంతులకే సోకుతోందని, విదేశాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్లి వచ్చిన వారి ద్వారానే వైరస్ రాష్ట్రంలోకి దిగుమతి అయిందని అన్నారు. ఈ ప్రాణాంతక వైరస్ రాష్ట్రంలో పుట్టినది కాదన్నారు. ఈ వైరస్ నివారణ సవాలుతో కూడుకున్నదని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో వైరస్ మరింత విస్తరించకుండా విజయవంతంగా అడ్డుకోగలిగామని పళనిస్వామి చెప్పారు.

కాగా, తమిళనాడులో నిన్న కొత్తగా 25 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1267కు పెరిగింది. అలాగే, ఈ వైరస్ బారినపడి ఒకరు మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 15కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 180 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని, ఇంకా 1072 యాక్టివ్ కేసులు ఉన్నాయని పళనిస్వామి వివరించారు.

More Telugu News