Card Less Cash: కార్డు లేకపోయినా ఏటీఎం నుంచి డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు... ఎలాగంటే..!

  • కార్టు లెస్ ట్రాన్సాక్షన్ సదుపాయాన్ని అందిస్తున్న బ్యాంకులు
  • బ్యాంకులను బట్టి విత్ డ్రాయల్ లిమిట్
  • కొన్ని సింపుల్ స్టెప్స్ తో కార్డ్ లెస్ క్యాష్
How to withdraw cash without debit card

లాక్ డౌన్ నేపథ్యంలో జనాలంతా ఇంటి  వద్దే ఉంటున్నారు. అవసరాల కోసం ఏటీఎంల నుంచి డబ్బును విత్ డ్రా చేసుకుంటున్నారు. అయితే, డెబిట్ కార్డు లేకుండానే ఏటీఎం నుంచి నగదును తీసుకునే సదుపాయం ఉంది. బ్యాంకులను బట్టి రోజువారీ లేదా ట్రాన్సాక్షన్ వారీగా రూ. 10 వేల నుంచి రూ. 20 వేల వరకు లిమిట్ ఉంది. కార్డు లేకుండా ఏటీఎం నుంచి డబ్బు తీసుకోవడం చాలా సులువు. కొన్ని స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది. అవేంటో చూద్దాం.

  • వినియోగదారుడు తొలుత తన స్మార్ట్ ఫోనులో బ్యాంక్ కు సంబంధించిన మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. 
  • ఆ తర్వాత యాప్ లోకి లాగిన్ అవ్వాలి.
  • అనంతరం 'సర్వీసెస్' ఆప్షన్ లోకి వెళ్లి, 'కార్డ్ లెస్ క్యాష్ విత్ డ్రాయల్ ఫర్ సెల్ఫ్' అనే ఆప్షన్ ను నొక్కాలి.
  • దీని తర్వాత... ఎంత మొత్తం కావాలి? 4 డిజిట్ పిన్ నంబర్? అకౌంట్ నంబర్ ను అడుగుతుంది.
  • వీటి వివరాలు సరైనవని నిర్ధారించుకున్న తర్వాత... సబ్మిట్ బటన్ ప్రెస్ చేయాలి.
  • అనంతరం వినియోగదారుడికి 'సక్సెస్' అనే మెసేజ్ వస్తుంది.
  • దీంతో పాటు వినియోగదారుడి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు బ్యాంకు నుంచి ఒక 'యూనిక్ కోడ్' ఎస్ఎంఎస్ ద్వారా వస్తుంది.
  • ఈ కోడ్ ను కస్టమర్ సేవ్ చేసుకోవాలి.
  • ఈ ప్రక్రియ మొత్తం పూర్తైన తర్వాత... సదరు బ్యాంకుకు చెందిన ఏటీఎంకు వినియోగదారుడు వెళ్లాలి.
  • ఏటీఎం మెషీన్ లో రిజిస్టర్డ్స్ మొబైల్ నంబర్, యూనిక్ కోడ్, ఏదైనా ఇతర టెంపరరీ కోడ్ వచ్చినట్టైతే దాన్ని కూడా ఎంటర్ చేయాలి.
  • దీంతో పాటు యాప్ లో ఎంటర్ చేసిన విత్ డ్రాయల్ అమౌంట్ ను కరెక్ట్ గా ఎంటర్ చేయాలి.
  • ఈ వివరాలను ఏటీఎం మెషీన్ సరిచూసుకున్న వెంటనే... మనకు కావాల్సిన మొత్తాన్ని డిస్పెన్స్ చేస్తుంది.

ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే... యాప్ లో ఎంటర్ చేసిన విత్ డ్రాయల్ అమౌంట్ ను ఏటీఎంలో ఒకే ట్రాన్సాక్షన్ లో తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు యాప్ లో రూ. 10 వేలు ఎంటర్ చేసినట్టైతే... ఏటీఎంలో రూ. 10 వేలు ఒకేసారి తీసుకోవాల్సి ఉంటుంది.

More Telugu News