Panchumarthi Anuradha: వైసీపీ మూర్ఖపు ఆలోచనలు మారడం లేదు: పంచుమర్తి అనురాధ

YSRCP foolish thoughts are not changing says Panchumarthi Anuradha
  • ఇంగ్లీష్ మీడియంను టీడీపీ ప్రవేశపెట్టింది
  • ఇంగ్లీష్ విద్య వద్దని ఎవరూ చెప్పలేదు
  • హైకోర్టులో అన్ని విషయాలు బయటపడ్డాయి
ఏడాదిలో 55 సార్లు కోర్టులు మొట్టికాయలు వేసినా వైసీపీ మూర్ఖపు ఆలోచనలు మారడం లేదని టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ విమర్శించారు. కింద పడినా మాదే పైచేయి అనే విధంగా ఆ పార్టీ నేతలు ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టడం గత టీడీపీ హయాంలోనే జరిగిందని చెప్పారు. మీడియంను ఎంచుకునే అవకాశాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకే టీడీపీ ప్రభుత్వం ఇచ్చిందని అన్నారు.

ఇంగ్లీషు విద్య వద్దని ఎవరూ చెప్పలేదని... మీడియంను ఎంచుకునే అవకాశాన్ని పిల్లలు, తల్లిదండ్రులకు ఇవ్వాలనే కోర్టు చెప్పిందని అనురాధ తెలిపారు. ఏపీ హైకోర్టులో అన్ని విషయాలు బయటపడ్డాయని... అయినా, ఇంగ్లీషు నేర్పొద్దని అంటారా? అని నటించడం వైసీపీ నేతలకే చెల్లిందని దుయ్యబట్టారు.
Panchumarthi Anuradha
Telugudesam
YSRCP
English Medium

More Telugu News