Rahul Gandhi: లాక్‌డౌన్‌ ఎత్తివేయగానే మళ్లీ కరోనా విజృంభించి తన పని తాను చేసుకుపోతుంది: రాహుల్ గాంధీ

  • లాక్‌డౌన్ తాత్కాలిక చర్య మాత్రమే
  • శాశ్వత పరిష్కారం కాదు
  • కరోనా నిర్ధారణ పరీక్షలను గణనీయంగా పెంచాలి
  • మనముందున్న ఒకే ఒక మార్గం ఇదే
  • దేశంలో రెండు జోనులు ఏర్పాటు చేయాలి
Rahul Gandhi says Lockdown doesnt defeat coronavirus pauses it asks government to test aggressively strategically

కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిన అంశంపై కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ ఈ రోజు వీడియో యాప్‌ ద్వారా మీడియా సమావేశంలో మాట్లాడారు. లాక్‌డౌన్‌తో కరోనా వైరస్‌ వ్యాప్తిని పూర్తిగా కట్టడి చేయలేమని అన్నారు.

'లాక్‌డౌన్ అనేది కేవలం వైరస్ తాత్కాలికంగా వ్యాప్తి చెందకుండా ఉండడానికి మనం వినియోగిస్తోన్న తాత్కాలిక పద్ధతి మాత్రమే. లాక్‌డౌన్‌ ఎత్తివేయగానే కరోనా వైరస్‌ మళ్లీ విజృంభించి తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతుంది. కొన్ని రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించడమనేది కరోనాకు శాశ్వత పరిష్కారం కాదు' అని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు.

'అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే కరోనా నిర్ధారణ పరీక్షలను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉంది. మనముందున్న ఒకే ఒక మార్గం ఇదే. దేశంలో రెండు జోనులు ఏర్పాటు చేయాలి.. ఒకటి హాట్‌స్పాట్‌, మరొకటి నాన్‌ హాట్‌స్పాట్‌ జోన్. ఆ తర్వాత ఆయా జోనుల్లో పలు చర్యలు తీసుకోవాలి' అని చెప్పారు.

'ర్యాండమ్‌ పద్ధతిలో కరోనా వైద్య పరీక్షలు నిర్వహించాలి. కరోనా పరీక్షలు వ్యూహాత్మకంగా జరగట్లేదు.
కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కరోనాకి లాక్‌డౌన్‌ పరిష్కారం కాదు. దినసరి కూలీలు, కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు' అని రాహుల్ చెప్పారు.

'చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రణాళికలు రచించాలి. దేశంలో ప్రస్తుతం చాలా తక్కువ మందికి పరీక్షలు చేస్తున్నారు. దీని సంఖ్యను భారీగా పెంచాల్సి ఉంది.ప్రజల ప్రాణాలను కాపాడాలి. అలాగే, మన దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమయ్యేలా చేయకూడదు' అని రాహుల్ అన్నారు.

More Telugu News