Tollywood: ఆర్ఆర్ఆర్​లో నేను నటించడం లేదు: నవదీప్

Iam not part in RRR movie says young hero
  • పుకార్లను కొట్టిపారేసిన యువ నటుడు
  • ఓ పాత్రకు మోహన్ లాల్‌ను తీసుకున్నట్టు ప్రచారం
  • అధికారిక ప్రకటన చేయని చిత్ర బృందం
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్) సినిమా గురించి రోజుకో పుకారు బయటకొస్తోంది. యువ నటుడు నవదీప్ ఈ చిత్రంలో నటిస్తున్నాడనే వార్త ఈ మధ్య చక్కర్లు కొడుతోంది. దీనిపై ఆ యువ హీరోనే స్పష్టత ఇచ్చాడు. ఆర్ఆర్ఆర్ లో తాను నటించడం లేదని తేల్చి చెప్పాడు. దీంతో ఈ పుకారుకు పుల్‌స్టాప్ పడింది.

అయితే, మలయాళ  స్టార్ మోహన్ లాల్ కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడని ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ దీనిపై ఆయన కానీ, చిత్ర బృందం కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఆర్ఆర్ఆర్ లో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. చరణ్ సరసన ఆలియా భట్, ఎన్టీఆర్ కు జోడీగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ నటిస్తోంది.
Tollywood
RRR
navadeep
not acting

More Telugu News