Corona Virus: కరోనా గరిష్ఠ స్థాయి నుంచి దిగొచ్చిన యూఎస్... కొత్త గైడ్ లైన్స్ ఉంటాయన్న డొనాల్డ్ ట్రంప్!

  • యూఎస్ లో కొత్త కేసుల నమోదు తగ్గుముఖం
  • అదే ట్రెండ్ కొనసాగుతుందని ట్రంప్ ఆశాభావం
  • మొత్తం 6.3 లక్షల మందికి సోకిన కరోనా
Less New Corona Cases in USA

అమెరికాలో కరోనా మహమ్మారి చూపించిన ప్రభావం తగ్గుముఖం పట్టిందని, కొత్త కేసుల సంఖ్య తగ్గడంతో సామాజిక దూరంపై కొత్త విధివిధానాలను రూపొందించే అవకాశం లభించిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. యూఎస్ లో కరోనా గరిష్ఠ స్థాయి నుంచి దిగివచ్చిందని, అయినా వైరస్ పై పోరాటం కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. తాజాగా శ్వేతసౌధంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్ వైరస్ సోకిన కొత్త కేసుల సంఖ్య సమీప భవిష్యత్తులో మరింతగా తగ్గుతుందని భావిస్తున్నట్టు ఆయన వెల్లడించారు.

కాగా, అమెరికాలో ఇప్పటివరకూ 6.3 లక్షల మందికి కరోనా పాజిటివ్ రాగా, బుధవారానికి దాదాపు 28 వేల మంది మరణించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ రోగుల సంఖ్య పరంగాను, మరణాల పరంగానూ అమెరికాదే అగ్రస్థానం. అయితే, మరణాల సంఖ్య వేల నుంచి వందల్లోకి దిగొచ్చింది. ఈ నెల తొలి వారంతో పోలిస్తే, కొత్త కేసుల సంఖ్యా తగ్గింది.  

గడచిన ఐదారు రోజులుగా కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇదే ట్రెండ్ నమోదవుతోందని వెల్లడించిన వైట్ హౌస్, కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు డాక్టర్ డెబోరా బ్రిక్స్, మరణాల సంఖ్యను మరింతగా తగ్గించేలా కృషి చేస్తామని తెలిపారు. వివిధ రాష్ట్రాలకు విడివిడిగా గైడ్ లైన్స్ రూపొందించే ఆలోచనలో ఉన్నట్టు తెలియజేశారు.

More Telugu News