Karnataka: చెట్లపై కుటుంబాలతో నివాసం: కరోనా వైరస్‌ నుంచి బయటపడేందుకు ‘మాస్టర్‌’ ప్లాన్‌!

  • ఊరికి దూరంగా అటవీ ప్రాంతానికి వలస
  • అక్కడి చెట్ల కొమ్మల మధ్య చిన్నపాటి గుడిసెల ఏర్పాటు
  • కర్ణాటక రాష్ట్రం పుణ్ణప్పాడి గ్రామస్థుల ముందు జాగ్రత్త

ప్రపంచాన్నే కరోనా వైరస్‌ వణికిస్తోంది. గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా చాలాచోట్ల దీని ప్రభావం ఉంది. ఈ కష్టకాలంలో వైరస్‌ బారిన పడకుండా ఎవరికి తోచిన జాగ్రత్తలు వారు తీసుకుంటున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమై వైరస్‌ సోకకుండా చూసుకుంటున్నారు.

అయితే, ఈ చర్యల వల్ల కూడా ఉపయోగం లేదనుకున్నాడో ఏమో కర్ణాటక రాష్ట్రం మంగళూరు జిల్లాలోని పుణ్ణప్పాడి గ్రామానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు సరికొత్త ఆలోచన చేశాడు. ఊరికి దూరంగా ఉన్న అటవీ ప్రాంతానికి కుటుంబంతో సహా చేరుకున్నాడు. అక్కడ చెట్ల కొమ్మల మధ్య చిన్న నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. గత కొన్ని రోజులుగా అక్కడే కాపురం పెట్టాడు. ఈయన చర్యలు బాగున్నాయనుకున్న గ్రామస్థుల్లో పలువురు కూడా ఆయన బాటపట్టి అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. చెట్ల కొమ్మల మధ్య నివాసాలు ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్నారు.

More Telugu News