Jagityal: ఆపరేషన్ కోసం గుంటూరు వెళ్లొచ్చిన జగిత్యాల బాలుడికి కరోనా.. హైదరాబాద్‌కు తరలింపు

5 Year Old Boy Infected to Covid 19 in Telangana
  • వినికిడి సమస్య ఆపరేషన్ కోసం గుంటూరు 
  • రెండు రోజుల క్రితం గ్రామానికి రాక
  • పరీక్షల్లో కరోనా పాజిటివ్
తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఐదేళ్ల బధిర బాలుడు కరోనా బారినపడ్డాడు. వెంటనే ఆ చిన్నారిని చికిత్స కోసం హైదరాబాద్ తరలించినట్టు ఆర్డీవో నరేందర్, జిల్లా ఉప వైద్యాధికారి జైపాల్ రెడ్డి తెలిపారు. బధిరులకు గుంటూరులో శస్త్రచికిత్స చేస్తున్న విషయం తెలుసుకున్న బాలుడి కుటుంబ సభ్యులు చిన్నారిని అక్కడికి తీసుకెళ్లి ఆపరేషన్ చేయించారు. రెండు రోజుల క్రితం స్వగ్రామానికి చేరుకున్నారు. ఏపీలో అత్యధిక కేసులు నమోదవుతున్న గుంటూరు నుంచి బాలుడు వచ్చాడన్న స్థానికుల సమాచారంతో గ్రామానికి చేరుకున్న వైద్యాధికారులు అతడి నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షించారు. చిన్నారికి కరోనా సోకినట్టు రిపోర్టుల్లో స్పష్టమైంది. దీంతో బాలుడిని వెంటనే హైదరాబాద్ తరలించారు.
Jagityal
Telangana
Guntur District
Boy
Corona Virus

More Telugu News