New Delhi: ఢిల్లీలో హింసను రెచ్చగొట్టే కుట్ర.. జామియా విద్యార్థికి 14 రోజుల కస్టడీ

  • సీఏఏకు వ్యతిరేకంగా అల్లర్లు
  • అల్లర్లలో ఐబీ అధికారి సహా 53 మంది మృతి
  • 9 రోజుల కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరు పరిచిన పోలీసులు
Jamia Student sent to 14 days judicial custody

ఈశాన్య ఢిల్లీలో హింసను రెచ్చగొట్టేందుకు కుట్ర పన్నిన ఆరోపణలపై అరెస్ట్ అయిన జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ) విద్యార్థికి ఢిల్లీ కోర్టు రెండు వారాల జుడీషియల్ కస్టడీ విధించింది. ఈ ఏడాది ఢిల్లీలో జరిగిన హింసాకాండలో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్‌శర్మతోపాటు ఓ హెడ్ కానిస్టేబుల్ కూడా ప్రాణాలు కోల్పోయారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఈ అల్లర్లలో 53 మంది మృతి చెందారు. హింసను ప్రోత్సహించాడంటూ జేఎంఐ విద్యార్థిని 9 రోజుల క్రితం అరెస్ట్ చేసిన పోలీసులు, తాజాగా అతడి కస్టడీ గడువు ముగియడంతో ఈ రోజు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రోహిత్ గులియా ఎదుట హాజరుపరిచారు. విచారించిన కోర్టు అతడిని 14 రోజుల జుడీషియల్ కస్టడీకి అప్పగించింది.

More Telugu News