Rammadhav: ‘కరోనా’ నేపథ్యంలో అమెరికన్ సీఈఓ ఒకరు రీడిజైన్ చేసిన ‘ఇండియన్ మ్యాప్’ ఇది!: బీజేపీ నేత రామ్ మాధవ్

  • ఇండియా మ్యాప్ లో ఇతర దేశాలు
  • కొన్ని రాష్ట్రాలలో ఉన్న  జనాభా చిన్న దేశాలలో జనాభాకు సమానం
  • ఆయా దేశాలు ‘కోవిడ్’పై వ్యవహరిస్తున్నట్టు  భారత్ ఒక్కటే పరోక్షంగా అలా వ్యవహరిస్తోంది 
BJP Leader Ram Madhav an interesting post

‘కరోనా’ వ్యాప్తి నిరోధక చర్యలపై భారతదేశం ఏవిధంగా సమర్ధవంతంగా ముందుకు వెళ్తోందో తెలియజెప్పేందుకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. అమెరికన్ సీఈఓ ఒకరు రీడిజైన్ చేసిన ‘ఇండియన్ మ్యాప్’ అంటూ ఓ పోస్ట్ పెట్టారు.

 భారతదేశ చిత్ర పటంలో మన రాష్ట్రాలకు బదులుగా ఇతర దేశాలు ఉండటం ఆ మ్యాప్ లో కనబడుతుంది. భారత్ లోని కొన్ని రాష్ట్రాలలో ఉన్న జనాభా, కొన్ని చిన్న దేశాలలో జనాభాకు దాదాపు సమానంగా వుందని ఆ సీఈఓ చేసిన వ్యాఖ్యలను రామ్ మాధవ్ ప్రస్తావించారు. వివిధ దేశాలలో ఉన్నటువంటి ‘కోవిడ్-19’ పరిస్థితులను భారత్ పరోక్షంగా ఎలా హ్యాండిల్ చేస్తున్నది తన ఉద్యోగులకు ఆ సీఈఓ తెలియజెప్పే ప్రయత్నం చేశారని ఆ పోస్ట్ లో రామ్ మాధవ్ పేర్కొన్నారు.

More Telugu News