Corona Virus: తెలంగాణలో కలకలం.. 20 మంది చిన్నారులకు కరోనా పాజిటివ్!

20 kids of Telangana affected with Corona Virus
  • గాంధీ ఆసుప్రతిలో చిన్నారులకు చికిత్స
  • బాధితులలో 23 రోజుల చిన్నారి నుంచి 12 ఏళ్ల వయసువారు
  • ఆసుపత్రి 6వ ఫ్లోర్ లో చికిత్స
తెలంగాణలో ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 644కు చేరుకుని కలకలం రేపుతోంది. మరోవైపు ఏకంగా 20 మంది చిన్నారులకు కరోనా పాజిటివ్ గా తేలడం ఆందోళనను మరింత పెంచుతోంది. ఈ 20 మంది 12 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. వీరిని హైదరాబాదులోని గాంధీ ఆసుప్రతిలో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం ప్రత్యేక ట్రీట్మెంట్ ఇస్తున్నారు.

బాధితులలో 23 రోజుల చిన్నారి నుంచి 12 ఏళ్ల వయసున్న వారి వరకు ఉన్నారు. గాంధీ ఆసుపత్రిలోని ఆరో ఫ్లోర్ లో వీరికి చికిత్స అందిస్తున్నారు. బాధితులలో ఓ మూడేళ్ల బాలుడికి ఇతర సమస్యలు కూడా ఉండటంతో... అతనికి ట్రీట్మెంట్ చేయడం వైద్యులకు సవాల్ గా మారింది.
Corona Virus
Telangana
20 kids

More Telugu News