Rashmika: ప్రేమ .. పెళ్లి గురించి నన్ను అడగొద్దు: యాంకర్ రష్మీ

Anchor Rashmika
  • నా ప్రొఫెషన్ గురించి అడగండి చెబుతాను
  •  ప్రేమ .. పెళ్లి అనేవి నా వ్యక్తిగత విషయాలు
  • పర్సనల్ విషయాలు చెప్పడం తనకు ఇష్టం ఉండదన్న రష్మీ 
బుల్లితెరపై యాంకర్ గా రష్మీకి మంచి క్రేజ్ వుంది. వెండితెరపై కూడా ఆమె తన ప్రత్యేకతను చాటుకుంటోంది. సామాజిక సమస్యల పట్ల ఎప్పటికప్పుడు రష్మీ స్పందిస్తూ ఉంటుంది. చైతన్యాన్ని పెంచే .. స్ఫూర్తిని రగిల్చే పోస్టులు పెడుతూ ఉంటుంది. ఇక తన వ్యక్తిగత విషయాల దగ్గరికి వచ్చేసరికి ఆమె చాలా సూటిగా సమాధానాలిస్తూ ఉంటుంది.

తాజాగా ట్విట్టర్లో ఒక అభిమాని 'పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు?' అని అడిగాడు. అందుకు రష్మీ స్పందిస్తూ  .. "పర్సనల్ లైఫ్ అంటే పర్సనల్ అనే అర్థం. నా ప్రొఫెషన్ గురించి అడగండి చెబుతాను. అంతేగానీ నా పర్సనల్ విషయాలను మాత్రం అడగకండి. ప్రేమ .. పెళ్లి అనేవి నా వ్యక్తిగత విషయాలు. వాటిని గురించి ఎవరూ అడగడం నాకు ఇష్టం ఉండదు. అడిగినా చెప్పడం ఇష్టం ఉండదు. ఇకముందు కూడా ఎవరైనా సరే ప్రేమ .. పెళ్లి విషయాలను గురించి దయచేసి నన్ను అడగొద్దు" అని చెప్పుకొచ్చింది.
Rashmika
Anchor
Tollywood

More Telugu News