Gujarat: కరోనా చికిత్సలో మత వివక్ష.. అహ్మదాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో హిందూ, ముస్లింలకు వేర్వేరు వార్డులు

  • వార్డుల విభజన నిజమే అన్న మెడికల్ సూపరింటెండెంట్
  • ప్రభుత్వ ఆదేశాల మేరకే ఇలా చేసినట్టు వివరణ
  • తమకు తెలియదన్న ఆరోగ్య శాఖ మంత్రి
Hospital in Ahmedabad splits COVID wards on faith

కరోనా వైరస్‌ బాధితులు, అనుమానితులకు చికిత్స అందించే విషయంలో  అహ్మదాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రి మత ఆధారిత వివక్ష చూపుతోందని  ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌’ కథనం ప్రచురించింది. ఆ ఆసుపత్రిలో హిందూ, ముస్లింలకు వేర్వేరుగా వార్డులు ఏర్పాటు చేసినట్టు స్వయంగా  మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ గుణవంత్ హెచ్ రాథోడ్ చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే ఇలా చేసినట్టు తెలిపారు. ఈ ఆసుపత్రిలో 150 మంది కరోనా పాజిటిట్ రోగులు ఉండగా.. వీరిలో 40 మంది వరకు ముస్లింలు ఉన్నట్టు సమాచారం.

 మతం ఆధారంగా వార్డులను విభజించడం గురించి తనకు తెలియదని గుజరాత్ ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి నితిన్ పటేల్ చెప్పడం గమనార్హం. అహ్మదాబాద్ కలెక్టర్ కేకే నిరా కూడా  తాము అలాంటి ఉత్తర్వులు ఏమీ ఇవ్వలేదన్నారు. మరోవైపు మతం ఆధారంగా వార్డుల విభజన నిజమేనని అక్కడి రోగులు చెబుతున్నారు.  ఆదివారం రాత్రి  ఒక బ్లాక్‌లోని  28 మందిని వారి పేర్లు ఆధారంగా బయటకు పిలిచి.. మరో వార్డుకు తరలించారని, వాళ్లంతా ఒకే మతానికి చెందిన వారని ఓ రోగి వెల్లడించారు.

More Telugu News