జగన్ ప్రభుత్వానికి షాక్.. 'ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి' జీవోలను కొట్టేసిన హైకోర్టు!
- ఇంగ్లీష్ మీడియం జీవోలను సవాల్ చేస్తూ పిటిషన్లు
- ఏ మీడియంలో చదువుకోవాలనేది విద్యార్థులు, తల్లిదండ్రులు నిర్ణయించుకుంటారని పిల్
- జీవో 81, జీవో 85లను కొట్టేసిన హైకోర్టు
పిటిషనర్ తరఫు న్యాయవాది ఇంద్రనీల్ వాదిస్తూ... ఏ మీడియంలో చదువుకోవాలనే నిర్ణయాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులే తీసుకుంటారని కోర్టుకు విన్నవించారు. ఇంగ్లీష్ మీడియం వల్ల బ్యాక్ లాగ్లు పెరిగిపోతాయని తెలిపారు. ఈ పిటిషన్లపై హైకోర్టు ఇటీవల వాదనలు విని, తీర్పును రిజర్వ్ చేసింది. ఈరోజు తుది తీర్పును వెలువరిస్తూ... 81, 85 జీవోలను కొట్టివేస్తున్నట్టు స్పష్టం చేసింది. ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియంను కూడా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.