Dil Raju: పారిశుద్ధ్య కార్మికులకు శానిటైజర్స్, మాస్కులను పంపిణీ చేసిన దిల్ రాజు

Dil Raji donates sanitigers  and  masks to sanitation workers
  • పారిశుద్ధ్య కార్మికుల  సేవలపై ప్రశంసలు
  • జీహెచ్ఎంసీ కార్యాలయంలో కార్యక్రమం
  • కార్యక్రమానికి హాజరైన మేయర్ బొంతు రామ్మోహన్
కరోనా కట్టడిలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు తమ ఆరోగ్యాన్ని సైతం పణంగా పెట్టి విధులను నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో పని చేస్తున్న కార్మికులు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నారు. తద్వారా వైరస్ విస్తరించకుండా తమ వంతు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికులపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఎంతోమంది వీరికి తమ వంతు సాయం చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు వీరికి శానిటైజర్స్, మాస్కులను పంపిణీ చేశారు. హైదరాబాదులోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మేయర్ బొంతు రామ్మోహన్ కూడా హాజరయ్యారు.
Dil Raju
Tollywood
Sanitiger Distribution

More Telugu News