Chiranjeevi: వినూత్న రీతిలో 'మెగా' కుటుంబ సభ్యుల 'కరోనా' సందేశం!

  • ఒక్కొక్కరు ఒక్కో ప్లకార్డు పట్టుకుని సందేశం
  • స్టేహోం, ఇంట్లో ఉంటాం, యుద్ధం చేస్తాం
  • క్రిమిని కాదు ప్రేమను పంచుతాం
  • కాలు కదపకుండా కరోనాని తరిమేస్తాం అంటూ మెసేజ్
MegaStar  KChiruTweets  via Instagram

కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోన్న నేపథ్యంలో మొదటి నుంచి జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తోన్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో పలు ఫొటోలు పోస్ట్ చేశారు. ఇందులో పవన్‌ కల్యాణ్‌, బన్నీ తప్ప మెగా కుటుంబంలోని వారంతా ఒక్కో ప్లకార్డు పట్టుకుని సందేశం ఇచ్చారు.  
                                                                                                                         
'స్టేహోం, ఇంట్లో ఉంటాం, యుద్ధం చేస్తాం, క్రిమిని కాదు ప్రేమను పంచుతాం.. కాలు కదపకుండా కరోనాని తరిమేస్తాం.. భారతీయులం ఒక్కటై భారత్‌ని గెలిపిస్తాం.. స్టే సేఫ్‌' అని మెగా కుటుంబంలోని వారంతా కలిసి సందేశం ఇచ్చారు.

కరోనాపై జాగ్రత్తలు తీసుకోవాలంటూ చిరంజీవి ఇప్పటికే పలు వీడియోలు రూపొందించారు. పలువురు హీరోలతో కలిసి ఆయన ప్రచారం చేస్తూ ఇతర సినీనటులు కూడా కరోనా జాగ్రత్తలపై ప్రచారం చేయాలంటూ ఆయన ప్రోత్సహిస్తున్నారు.

దేశంలో కరోనా విజృంభణ తగ్గకపోవడంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిన్న లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించారు. ఈ నేపథ్యంలో తన కుటుంబంతో కలిసి చిరంజీవి ఇలా వినూత్న రీతిలో మరోసారి కరోనాపై జాగ్రత్తలు తీసుకోవాలంటూ ప్రచారం చేశారు. ప్రస్తుతం దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,439 కి చేరిన విషయం తెలిసిందే.

'మనమంతా కలిసి ఈ యుద్ధంలో గెలుస్తాం! ఎక్కడ ఉన్న వాళ్లం అక్కడే ఉందాం. మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు మనం ప్రేమించే వారిని రక్షిస్తూ.. ప్రపంచాన్ని సురక్షితంగా ఉంచుదాం' అని ఈ సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి ట్వీట్ చేశారు.

More Telugu News