WWE: 'డబ్ల్యూడబ్ల్యూఈ'కి అత్యవసర సర్వీసుల స్టేటస్.. లైవ్ ప్రారంభం!

  • ప్రొఫెషనల్ స్పోర్ట్స్ కు అత్యవసర సర్వీసుల స్టేటస్ ఇచ్చిన ఫ్లోరిడా గవర్నర్
  • వీక్లీ సిరీస్ 'రా'ను ప్రసారం చేసిన డబ్ల్యూడబ్ల్యూఈ
  • అదే బాటలో ముందుకు సాగుతున్న ఇతర సంస్థలు
WWE Gains Essential Services Status

వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ)కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. అమెరికాలో అయితే దీనికున్న క్రేజ్ మరింత ఎక్కువ. అయితే, కరోనా వైరస్ నేపథ్యంలో అమెరికాలో అన్ని స్పోర్ట్స్ ఈవెంట్స్ ఆగిపోయాయి.

అయితే, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డి శాంటిస్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ డబ్ల్యూడబ్ల్యూఈకి కలిసొచ్చింది. జాతీయ స్థాయిలో ప్రేక్షకులను కలిగి ఉన్న ప్రొఫెషనల్ స్పోర్ట్స్, మీడియా ప్రొడక్షన్స్ వారికి కార్యకలాపాలను కొనసాగించేందుకు గవర్నర్ అనుమతించారు. అయితే ఈ ఈవెంట్లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు జనరల్ పబ్లిక్ కు అనుమతి ఉండరాదు.

ఈ ఆర్డర్ వచ్చిన వెంటనే డబ్ల్యూడబ్ల్యూఈ  మేనేజ్ మెంట్ స్పందించింది. అత్యవసర సర్వీసుల స్టేటస్ ను తెచ్చుకుంది. తన వీక్లీ సిరీస్ 'రా'ను ప్రత్యక్ష ప్రసారం చేసింది. డబ్ల్యూడబ్ల్యూఈ చర్యతో ఇతర సంస్థలు కూడా కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి.

More Telugu News