Gujarat: గుజరాత్ లో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు పోలీసు డ్యూటీ

RTC drivers and conductors performing Police duty in Surat
  • గుజరాత్ బార్డోలీలో సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్న పోలీసులు
  • ఆర్టీసీ సిబ్బంది సేవలను వినియోగించుకుంటామని కోర్టుకు విన్నపం
  • గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ కోర్టు
గుజరాత్ సూరత్ లోని బర్డోలిలో జీఎస్ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు పోలీసుల విధులను నిర్వహిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే, బార్డోలీ పోలీసులు సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నారు. దీంతో, ఆర్టీసీ సిబ్బంది సేవలను వినియోగించుకుంటామని సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ విజయ్ రబారీని పోలీసు అధికారులు సంప్రదించారు. దీనికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఈ సందర్భంగా పోలీస్ ఇన్స్ పెక్టర్ గిలాటర్ మాట్లాడుతూ, ఆర్టీసీ సిబ్బందికి శిక్షణ ఇచ్చామని, పట్టణంలో తిరిగేలా వారికి గుర్తింపు కార్డులను అందించామని చెప్పారు. ఆర్టీసీ డ్రైవర్ ప్రవీణ్ కులకర్ణి మాట్లాడుతూ, సూరత్, బార్డోలి మధ్య బస్సును నడిపేవాడినని... ఇప్పుడు పోలీసు విధులను నిర్వహిస్తుండటం కొత్తగా ఉందని చెప్పాడు. లాక్ డౌన్ సమయంలో విధులను నిర్వహిస్తుండటం ఆనందంగా ఉందని తెలిపాడు.
Gujarat
Surat
RTC
Staff
Police

More Telugu News