D Mart: జనంతో కిక్కిరిసిపోయిన డీమార్ట్.. విస్తుపోయి సీజ్ చేసిన జీహెచ్ఎంసీ అధికారులు

D Mart seized by GHMC Officials
  • హైదరాబాద్, ఎల్బీనగర్‌లో ఘటన
  • భౌతక దూరం నిబంధన గాలికి వదిలేసి విక్రయాలు
  • నిబంధనలు పెడచెవిన పెట్టిన జనం
కరోనా వైరస్ మరింత ప్రబలకుండా సామాజిక దూరం పాటించాలని, జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు, అధికారులు పదేపదే చేస్తున్న విజ్ఞప్తులు ఎవరికీ పట్టడం లేదు. ఇటు కొందరు ప్రజలు, అటు నిత్యావసరాలు విక్రయించే మాల్స్ కూడా భౌతిక దూరం సూత్రాన్ని అటకెక్కించి యథేచ్ఛగా విక్రయాలు జరుపుతున్నారు.

హైదరాబాద్, ఎల్బీనగర్‌లోని డీమార్ట్ కూడా ఇలానే నిబంధనలు ఉల్లంఘించి విక్రయాలు జరుపుతుండడంతో అధికారులు సీజ్ చేశారు. మంగళవారం డీమార్ట్‌ను తనిఖీ చేసిన జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు విస్తుపోయారు. జనాలు కిక్కిరిసిపోయి ఉండడంతో స్పందించిన అధికారులు సదరు సూపర్ మార్కెట్ ను సీజ్ చేసి నోటీసులు అంటించారు.
D Mart
Hyderabad
LB Nagar
Corona Virus

More Telugu News