Gujarath: గుజరాత్ ఎమ్మెల్యేకు కరోనా... అంతకుముందే సీఎంతో భేటీ కావడంతో కలకలం!

Gujarath MLA Corona Positive after Meeting With CM
  • విజయ్ రూపానీని కలిసిన ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేడావాలా
  • అప్పటికే జ్వరంతో బాధపడుతూ ఉన్న ఎమ్మెల్యే
  • సమావేశంలో హోమ్, ఆరోగ్య మంత్రులు కూడా
గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, మరో ఇద్దరు మంత్రులను కలిసి చర్చలు జరిపి వచ్చిన కొన్ని గంటల తరువాత, ఓ ఎమ్మెల్యేకు కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో, ఆ రాష్ట్రం ఉలిక్కిపడింది. జమలాపూర్ - ఖాడియా ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేడావాలా, గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. పరీక్షల నిమిత్తం శాంపిల్స్ కూడా ఇచ్చారు. దాని రిజల్ట్స్ రాకముందే బయటకు వచ్చి, సీఎంతో సమావేశమయ్యారు.

ప్రస్తుతం ఆయనకు గాంధీనగర్ లోని ఎస్వీపీ ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నామని అధికారులు తెలిపారు. ఇక, సదరు ఎమ్మెల్యేను కలిసిన వారందరినీ ముందు జాగ్రత్తగా క్వారంటైన్ చేశామని వెల్లడించారు. సీఎంను కలిసిన సమయంలో ఎమ్మెల్యే వీడియో విడుదలైంది. ఈ వీడియోలో వారంతా సోషల్ డిస్టెన్సింగ్ ను పాటించినట్టు కనిపిస్తోంది. ఇదే సమావేశంలో రాష్ట్ర హోమ్, ఆరోగ్య మంత్రులు కూడా పాల్గొన్నారు.
Gujarath
Corona Virus
CM
Congress
MLA

More Telugu News