Andhra Pradesh: గుంటూరును భయపెడుతున్న కరోనా.. రాష్ట్రంలో అత్యధిక కేసులు అక్కడే!

  • జిల్లాలో ఇప్పటి వరకు 114 కేసుల నమోదు
  • రాష్ట్రంలో ఇప్పటి వరకు 9 మంది మృతి
  • 91 కేసులతో రెండో స్థానంలో కర్నూలు
Corona virus Cases raising in Guntur

ప్రాణాంతక కరోనా వైరస్ గుంటూరు జిల్లా వాసులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. రాష్ట్రంలో మొత్తంగా 483 కేసులు నమోదు కాగా, ఒక్క గుంటూరులోనే ఏకంగా 114 కేసులున్నాయి. రాష్ట్రంలో మరే జిల్లాలోనూ ఈ స్థాయిలో కేసులు నమోదు కాలేదు. నిన్న రాష్ట్రవ్యాప్తంగా 10 కేసులు వెలుగుచూడగా, సరిగ్గా సగం కేసులు గుంటూరులోనే నమోదు కావడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

కరోనా మహమ్మారితో రాష్ట్రంలో ఇప్పటి వరకు 9 మంది ప్రాణాలు కోల్పోయారు. 16 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 458 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గుంటూరు తర్వాత 91 కేసులతో కర్నూలు రెండో స్థానంలో ఉండగా, నెల్లూరు (56), కృష్ణా (44), ప్రకాశం (42) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. తూర్పుగోదావరిలో అత్యల్పంగా 17 కేసులు నమోదయ్యాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
.

More Telugu News