H-1B Visa: ‘కరోనా’ ఎఫెక్ట్.. హెచ్-1బీ వీసా గడుపు పెంపుకు యూఎస్ ప్రభుత్వం నిర్ణయం

  • ‘కరోనా’ ప్రభావంతో  అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు
  • గడువు ముగియనున్న హెచ్-1బీ వీసాదారుల ఆందోళన
  • వీసా గడువు పొడిగిస్తాం.. త్వరలోనే దరఖాస్తులు స్వీకరిస్తాం: డీహెచ్ఎస్  
US Government has taken decesion to increase d H1B Visa deadline

ప్రపంచ వ్యాప్తంగా ‘కరోనా’ సంక్షోభంతో ఎక్కడి వారు అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. హెచ్-1బీ వీసాపై అమెరికా వెళ్లిన భారతీయుల పరిస్థితి కూడా అలాగే ఉన్న తరుణంలో వారికి ఊరట ఇచ్చే మాటను యూఎస్ ప్రభుత్వం చెప్పింది. ‘కరోనా’ కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు కావడంతో చాలా మంది హెచ్- 1బీ వీసాదారులు అమెరికాలోనే ఉండిపోవాల్సి వచ్చిందని, అందులో కొందరి వీసా గడువు త్వరలోనే ముగియనున్న కారణంగా ఆందోళన చెందుతున్నారు.

ఈ నేపథ్యంలో యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) ఓ ప్రకటన చేసింది. వీరి వీసా గడువు పొడిగించేందుకు త్వరలోనే దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించింది. హెచ్-1 బీ వీసా గడువు ముగిసినా ‘కరోనా’ కారణంగా ఎక్కడికీ వెళ్లలేక ఇక్కడే ఉండిపోయిన పరిస్థితిని తాము గుర్తించామని చెప్పింది. ఈ వీసాపై ఉన్న వారు గడువు పొడిగించాలని కోరుతూ సరైన సమయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం హెచ్-1బీ వీసాపై 240 రోజుల గడువు దానంతట అదే లభిస్తుందని తెలిపింది. అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో హెచ్-1బీ వీసాపై అక్కడికి వెళ్లి చిక్కుకుపోయిన భారతీయులకు ఊరట లభించినుంది.

More Telugu News