Samsung India: కొవిడ్-19పై పోరాటానికి రూ.20 కోట్లు విరాళం ప్రకటించిన శాంసంగ్ ఇండియా

  • రూ.15 కోట్లు పీఎం కేర్స్ ఫండ్ కు విరాళం
  • మరో రూ.5 కోట్లు తమిళనాడు, యూపీ రాష్ట్రాలకు కేటాయింపు
  • మంచి నిర్ణయం అంటూ శాంసంగ్ ను అభినందించిన ప్రధాని మోదీ
Samung India donates tewnty crores for anti corona battle

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల సంస్థ శాంసంగ్ ఇండియా కరోనా భూతంపై పోరాటానికి తన వంతు సాయం ప్రకటించింది. కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.20 కోట్లు ఇస్తున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. కొవిడ్-19పై పోరులో భారత ప్రజలకు తాము మద్దతుగా నిలుస్తామని శాంసంగ్ వెల్లడించింది. రూ.15 కోట్లు పీఎం కేర్స్ ఫండ్ కు, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు కలిపి రూ.5 కోట్లు ఇస్తున్నట్టు వివరించింది.

అంతేగాకుండా, తమ ఉద్యోగులు దేశవ్యాప్తంగా వ్యక్తిగతంగానూ విరాళాలు అందిస్తున్నారని తెలిపింది. మున్ముందు, తమ ఉద్యోగుల విరాళాల మొత్తానికి సమాన మొత్తాన్ని కలిపి పీఎం కేర్స్ ఫండ్ కు అందిస్తామని కూడా శాంసంగ్ ఇండియా పేర్కొంది. ఈ ప్రకటన పట్ల ప్రధాని మోదీ స్పందించారు. అగ్రగామి కంపెనీలు కూడా కరోనాపై పోరాటంలో కలిసి వస్తున్నాయని, శాంసంగ్ ఇండియా మంచి నిర్ణయం తీసుకుందని ప్రశంసించారు.

More Telugu News