కృష్ణ పుట్టినరోజున మహేశ్ మూవీ లాంచ్
- పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ బాబు
- మే 31వ తేదీన పూజా కార్యక్రమాలు
- వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచన
గతంలో మహేశ్ బాబుతో 'శ్రీమంతుడు'ను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ వారు ఇప్పుడీ సినిమాను నిర్మించనున్నారు. పరశురామ్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను కృష్ణ పుట్టిన రోజైన మే 31వ తేదీన లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఆ తరువాత రెగ్యులర్ షూటింగుకు వెళ్లే దిశగానే పనులను పూర్తి చేస్తున్నారట. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం.