Andhra Pradesh: అత్యవసర ప్రయాణాలకు ఎమర్జెన్సీ పాసులు ఇవ్వనున్న ఏపీ పోలీసులు.. వివరాలు ఇవిగో!

  • అత్యవసర పనులు ఉన్న వారికి ప్రయాణించే వెసులుబాటు
  • పాసులు కావాల్సిన వారు పోలీసులకు పూర్తి వివరాలు సమర్పించాలి
  • తప్పుడు సమాచారం ఇస్తే కఠిన చర్యలు
AP police to issue emergency vehicle passes to needy people

కరోనా మహమ్మారి కట్టడి కోసం లాక్ డౌన్ విధించడంతో జనాలంతా ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు. ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ... ఎవరికీ ప్రయాణించే అవకాశం దొరకడం లేదు. ఈ నేపథ్యంలో, అత్యవసరం ఉన్న వ్యక్తులకు ఏపీ పోలీసులు భరోసా ఇచ్చారు. వారు ప్రయాణించేందుకు పాసులు ఇవ్వనున్నట్టు చెప్పారు.

మెడికల్ ఎమర్జెన్సీ, సామాజిక సేవ కోసం వెళ్తున్న వారితో పాటు ఇతర అత్యవసర సేవల్లో ఉన్నవారికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని... అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పోలీసు శాఖ తెలిపింది. కేవలం అత్యవసరం ఉన్నవారు మాత్రమే ఈ సదుపాయాన్ని వినియోగించకోవాలని కోరింది.  

అత్యవసర పాస్ లు కావాల్సిన వారు ఈ వివరాలను పోలీసులకు సమర్పించాల్సి ఉంటుంది. పూర్తి పేరు, చిరునామా, ఆధార్ కార్డు వివరాలు, వాహనం నెంబర్, ప్రయాణికుల సంఖ్య, బయలుదేరే స్టార్టింగ్ పాయింట్, గమ్యస్థానం వివరాలు ఇవ్వాలి. ఈ వివరాలను పరిశీలించిన తర్వాత అవసరమైన వ్యక్తులకు అధికారులు పాసులు మంజూరు చేస్తారు. తప్పుడు వివరాలు ఇచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. పాస్ కావాల్సిన వారు తమ వివరాలను జిల్లా ఎస్పీకి ఆ జిల్లా వాట్సాప్ నంబర్ కు లేదా ఈమెయిల్ కు పంపించాలి. జిల్లాల వారీగా వాట్సాప్ నంబర్, ఈమెయిల్ వివరాలు ఇవిగో..
.

  • Loading...

More Telugu News