మహేశ్ బాబు మూవీలో విలన్ గా ఉపేంద్ర?

14-04-2020 Tue 13:00
  • సెట్స్ పైకి వెళ్లనున్న మహేశ్ మూవీ
  • సన్నాహాలు పూర్తి చేస్తున్న పరశురామ్
  • ఉపేంద్ర వైపు మొగ్గు చూపిన యూనిట్ సభ్యులు  
Parashuram Movie

పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి మహేశ్ బాబు సిద్ధమవుతున్నాడు. లాక్ డౌన్ తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ఈ సినిమాలో ప్రతినాయక పాత్ర చాలా పవర్ఫుల్ గా వుంటుందట. దాంతో సోనూ సూద్ - ఉపేంద్రల పేర్లను పరిశీలించారు.

యూనిట్ సభ్యుల్లో ఎక్కువ మంది, ఈ సినిమాలోని ప్రతినాయక పాత్రకి ఉపేంద్ర అయితేనే కరెక్ట్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. పరశురామ్ ఈ విషయాన్ని మహేశ్ బాబు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన కూడా ఉపేంద్రని తీసుకోవడమే కరెక్ట్ అని అన్నాడట. దాంతో ఉపేంద్రతో సంప్రదింపులు మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. 'సన్నాఫ్ సత్యమూర్తి'తో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన ఉపేంద్ర, ఈ పాత్రతో ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి.