T20: అభిమానులు లేకుండా టీ20 ప్రపంచకప్పా?: ఊహించుకోలేనన్న బోర్డర్

  • క్రీడారంగంపై కరోనా పంజా
  • ఈ ఏడాది జరగాల్సిన టీ20 ప్రపంచకప్
  • స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ లు నిర్వహించాలనే ప్రతిపాదన
Allan Border cant imagine T20 World Cup without fans

కరోనా వైరస్ దెబ్బకు క్రీడారంగం మొత్తం స్తంభించిపోయింది. ఒలింపిక్స్ వంటి మేజర్ ఈవెంట్ కూడా కరోనా కారణంగా వాయిదా పడింది. క్రికెట్ టోర్నీలు, సీరీస్ లు కూడా ఆగిపోయాయి. మరోవైపు ఈ ఏడాది అక్టోబర్ లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ పై కూడా నీలి మేఘాలు కమ్ముకున్నాయి. అయితే, స్టేడియంలలోకి ప్రేక్షకులను అనుమతించకుండా... ఖాళీ స్టేడియాలలో మ్యాచ్ లను నిర్వహించాలనే ప్రతిపాదన ఉంది. ప్రేక్షకులు కేవలం మ్యాచ్ టెలికాస్ట్ ను మాత్రమే చూస్తారన్నమాట. అయితే, ఈ ప్రతిపాదనపై ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ కెప్టెన్ అలెన్ బోర్డర్ పెదవి విరిచారు.

ఖాళీ స్టేడియంలలో క్రికెట్ మ్యాచ్ లను అస్సలు ఊహించుకోలేకపోతున్నానని బోర్డర్ అన్నారు. ఈ ప్రతిపాదనను తాను ఒప్పుకోలేనని చెప్పారు. స్టేడియంలో ప్రేక్షకులు లేకపోతే ఆ మ్యాచ్ కు అర్థం ఉండదని... ఇది జరగకూడదనే తాను కోరుకుంటున్నానని తెలిపారు. పరిస్థితి అదుపులోకి రాకపోతే టోర్నీని రద్దు చేసి... మరో సురక్షిత ప్రాంతంలో నిర్వహించాలని సూచించారు.

  • Loading...

More Telugu News