రీమేక్ పట్ల ఆసక్తి చూపని బాలకృష్ణ .. తెరపైకి వెంకటేశ్?

14-04-2020 Tue 11:13
  • మలయాళంలో హిట్ కొట్టిన మూవీ
  • రీమేక్ ఆలోచనలో సితార బ్యానర్
  •  నిర్మాణ భాగస్వామిగా సురేశ్ ప్రొడక్షన్స్
Ayyappanum Koshiyum Movie

మలయాళంలో ఇటీవల వచ్చిన 'అయ్యప్పనుమ్ కోశియుమ్' చిత్రం అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇద్దరు బలమైన వ్యక్తుల మధ్య చోటుచేసుకునే ఇగో సమస్యల నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. వైవిధ్యభరితమైన చిత్రంగా ప్రశంసలు అందుకోవడంతో, ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి సితార ఎంటర్టైన్మెంట్స్ వారు రంగంలోకి దిగారు.

బాలకృష్ణ - రానా ప్రధాన పాత్రధారులుగా ఈ సినిమాను చేయాలనుకున్నారు. అయితే బాలకృష్ణ అంతగా ఆసక్తిని చూపలేదని సమాచారం. ఈ నేపథ్యంలోనే నిర్మాణ భాగస్వామిగా సురేష్ ప్రొడక్షన్స్ ముందుకు వచ్చిందట. దాంతో ఈ సినిమాలో వెంకటేశ్ - రానా నటించనున్నారనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. వెంకటేశ్ - రానా కాంబినేషన్లో ఒక సినిమా చేయాలనే ఉద్దేశంతో సురేశ్ బాబు ఉండబట్టి చాలా కాలమైంది. ఆ ముచ్చట ఈ సినిమాతో తీరుతుందని చెప్పుకుంటున్నారు.