TGB: వినియోగదారులకు టీజీబీ బ్యాంక్ గుడ్ న్యూస్

TGB lifts minimum balance condition
  • మినిమన్ బ్యాలెన్స్ నిబంధనను ఎత్తివేసిన తెలంగాణ గ్రామీణ బ్యాంక్
  • లాక్ డౌన్ నేపథ్యంలో నిర్ణయం
  • ఇప్పటికే మినిమం బ్యాలెన్స్ ను ఎత్తివేసిన ఎస్బీఐ
ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ లేకపోతే ఛార్జీల పేరుతో బ్యాంకులు నడ్డి విరుస్తాయనే సంగతి తెలిసిందే. అయితే, లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో తన వినియోగదారులకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. మినిమమ్ బ్యాలెన్స్ లేని ఖాతాలపై విధిస్తున్న ఛార్జీలను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది.

ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని బ్యాంక్ ఛైర్మన్ అర్వింద్ తెలిపారు. ప్రస్తుతం రూరల్, సెమీ అర్బన్ ఏరియాల్లో మినిమమ్ బ్యాలెన్స్ రూ. 500, అర్బన్ ప్రాంతాల్లో రూ. 1500 మెయింటైన్ చేయాల్సి ఉంది. లేనిపక్షంలో టీజీబీ రూ. 250 ఛార్జీ వసూలు చేస్తుంది. ఇప్పుడు ఆ ఛార్జీని ఎత్తి వేసింది. మరోవైపు, ఎస్బీఐ కూడా మినిమన్ బ్యాలెన్స్ నిబంధనను ఇప్పటికే ఎత్తివేసింది.
TGB
Telangana Grameena Bank
Minimum Balance

More Telugu News