'శ్యామ్ సింగ రాయ్' విషయంలో పట్టువీడని నాని

14-04-2020 Tue 10:37
  • నాని తాజా చిత్రంగా రూపొందిన 'వి'
  • రాహుల్ దర్శకత్వంలో 'శ్యామ్ సింగ రాయ్'
  • అనిరుధ్ కావాలంటున్న నాని 
Shyam Sing Rai Movie

కథాకథనాల విషయంలోను .. పాత్రల రూపకల్పనలోను వైవిధ్యానికి ప్రాధాన్యతనిచ్చే కథానాయకుడిగా నాని కనిపిస్తాడు. జయాపజయాల సంగతి అటుంచితే, ఆయన సినిమాల్లో కొత్తదనం మాత్రం కనిపిస్తుంది. అలా రూపొందిన 'వి' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత సినిమాను ఆయన రాహుల్ దర్శకత్వంలో చేయనున్నాడు.

ఈ సినిమాకి 'శ్యామ్ సింగ రాయ్' టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా అనిరుధ్ ను తీసుకోవాలని నాని పట్టుపడుతున్నాడట. గతంలో నాని 'జెర్సీ' .. 'గ్యాంగ్ లీడర్' సినిమాలకి అనిరుధ్ సంగీతాన్ని అందించాడు. ఆ రెండు సినిమాలు విజయాలను అందుకున్నాయి. 'శ్యామ్ సింగ రాయ్' కథ భిన్నమైనది కావడంతో, అనిరుధ్ అయితేనే బాగుంటుందనే ఉద్దేశంతో నాని అతన్ని సిఫార్స్ చేస్తున్నాడట. అనిరుధ్ పారితోషికం ఎక్కువే అయినా, ఆయననే దర్శక నిర్మాతలు సంప్రదిస్తున్నట్టు సమాచారం.