Shalini Pandey: అలాంటి వారితో సంబంధం తెంచుకోవడమే ఉత్తమం: షాలిని పాండే 

Better cut relationehip with them says Shalini Pandey
  • మనపై ఎవరైనా ఆధిపత్యాన్ని చెలాయిస్తే భరించలేం
  • అలాంటి వారికి దూరంగా ఉండటమే మంచిది
  • వారితో సంబంధాలు తెంచుకోవడమే ఉత్తమం 
'అర్జున్ రెడ్డి' సినిమా ద్వారా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన షాలిని పాండే... బిజీ ఆర్టిస్టుగా మారిపోయింది. దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్ లో సైతం అవకాశాలను చేజిక్కించుకుని దూసుకుపోతోంది. బాలీవుడ్ లో ఒకే సారి రెండు, మూడు సినిమాల్లో ఆమె అవకాశాలను చేజిక్కించుకుంది. మరోవైపు, మన జీవితంపై ఆధిపత్యం చెలాయించే వారికి దూరంగా ఉండాలని షాలిని సూచిస్తోంది.

ఎవరైనా మనపై ఆధిపత్యాన్ని చెలాయిస్తే భరించలేమని షాలిని చెప్పింది. మనపై ఆధిపత్యం చెలాయించే అవకాశాన్ని ఎవరికీ ఇవ్వకూడదని తెలిపింది. అలాంటి వారికి దూరంగా ఉండటమే మంచిదని... వారు మనకు ఎంత కావాల్సిన వారైనా సంబంధాలను తెంచుకోవడమే ఉత్తమమని చెప్పింది. అలాంటి వారిని తాను ఒక్క క్షణం కూడా భరించలేనని... వారిని దూరంగా పెడతానని, లేకపోతే వారికి తాను దూరంగా వెళ్లిపోతానని తెలిపింది.
Shalini Pandey
Tollywood
Bollywood
Relationship

More Telugu News