'ఎఫ్ 3'లోను వాళ్లే కథానాయికలు!

14-04-2020 Tue 09:41
  • భారీ సక్సెస్ ను సాధించిన 'ఎఫ్ 2'
  • సీక్వెల్ కి జరుగుతున్న సన్నాహాలు
  • అవే పాత్రలు .. అవే పేర్లు
F3 Movie

అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'ఎఫ్ 2' సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువైంది. వెంకటేశ్ - వరుణ్ తేజ్ తోడల్లుళ్లుగా చేసిన సందడి .. వాళ్ల భార్యలుగా తమన్నా - మెహ్రీన్ ల అందాల ఆరబోతను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. దాంతో ఆ సినిమాకి సీక్వెల్ చేసే పనిలో అనిల్ రావిపూడి బిజీగా వున్నాడు.

ఈ సినిమాలో వెంకటేశ్ - వరుణ్ తేజ్ పాత్రలు అలాగే ఉంటాయనీ, తమన్నా - మెహ్రీన్ పాత్రల్లో వేరే హీరోయిన్స్ కనిపించనున్నారనే టాక్ వచ్చింది. అయితే అందులో నిజం లేదని తెలుస్తోంది. వెంకటేశ్ - వరుణ్ తేజ్ భార్యలుగా తమన్నా .. మెహ్రీన్ లే కనిపించనున్నారని అంటున్నారు. 'ఎఫ్ 2'లో వున్న ఆర్టిస్టులే ఉంటారట.. వాళ్ల పాత్రల పేర్లను కూడా అనిల్ రావిపూడి మార్చడం లేదనేది సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.