ఢిల్లీలో ముగ్గురు పోలీసులకు కరోనా.. డీసీపీ సహా 30 మంది పోలీసుల క్వారంటైన్

14-04-2020 Tue 08:32
  • ఇద్దరు ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుల్‌కు కరోనా
  • వారితో సన్నిహితంగా మెలిగిన వారందరికీ సెల్ఫ్ క్వారంటైన్
  • కరోనా కేసుల్లో దేశంలో రెండో స్థానంలో ఢిల్లీ
Three Delhi cops infected to corona 30 police self quarantine

ఢిల్లీలో కరోనా విధుల్లో ఉన్న పోలీసులకు వైరస్ సోకడంతో 30 మంది పోలీసులు సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతం దేశ రాజధానిలో కరోనా కేసుల సంఖ్య భయపెట్టేలా పెరుగుతోంది. దేశంలో మహారాష్ట్ర తర్వాత అత్యధిక కేసులతో ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు ఢిల్లీలో 1510 కేసులు నమోదు కాగా, 28 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఇద్దరు ఏఎస్ఐలతోపాటు ఓ హెడ్‌కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో వారితో సన్నిహితంగా మెలిగిన డీసీపీ సహా 30 మందిని ముందు జాగ్రత్త చర్యగా సెల్ఫ్ క్వారంటైన్ చేశారు. కాగా, దేశవ్యాప్తంగా మొత్తం 10,453 కరోనా నిర్ధారిత కేసులు నమోదయ్యాయి. 358 మంది ప్రాణాలు కోల్పోయారు.