తెలంగాణ సీఎం సహాయనిధికి.. జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ, జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ విరాళాలు

13-04-2020 Mon 21:19
  • జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ రూ.1 కోటి విరాళం
  • జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ విరాళం రూ.50 లక్షలు
  • సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళం
  • నరేంద్ర చౌదరికి ధన్యవాదాలు తెలిపిన సీఎం కేసీఆర్
NTV Narendra Choudary handed over checks to CM KCR

కరోనా కట్టడి, సహాయక చర్యల కోసం జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ రూ.1 కోటి విరాళం ప్రకటించింది. అటు, జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ కూడా  సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.50 లక్షలు విరాళంగా అందించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన చెక్కులను జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్షుడు, 'ఎన్టీవీ' నరేంద్ర చౌదరి సీఎం కేసీఆర్ కు అందించారు. ఈ సందర్భంగా నరేంద్ర చౌదరి వెంట సొసైటీ కార్యదర్శి టి.హనుమంతరావు కూడా ఉన్నారు. విరాళాలు అందించడం ద్వారా సంఘీభావం ప్రకటించినందుకు సీఎం కేసీఆర్ వారికి ధన్యవాదాలు తెలిపారు.