Jagan: అంబేద్కర్ కు నిండు మనసుతో నివాళులర్పిస్తున్నా: సీఎం జగన్

CM Jagan tributes Ambedkar Jayanthi
  • రేపు అంబేద్కర్ జయంతి
  • అంబేద్కర్ ను మరణంలేని మహాశక్తిగా అభివర్ణించిన సీఎం
  • సమాజానికి దార్శనికులు అంటూ ట్వీట్
రేపు ఏప్రిల్ 14న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి. ఈ సందర్భంగా అంబేద్కర్ కు ఏపీ సీఎం వైఎస్ జగన్ నివాళులర్పించారు. భారత సమాజానికి దార్శనికులు బాబా సాహెబ్ అంటూ కీర్తించారు. అనేక దశాబ్దాలుగా దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ విధానాల నిర్ణేత అంబేద్కర్ అని, ఆయన మరణంలేని మహాశక్తి అని కొనియాడారు. రేపు రాజ్యాంగ నిర్మాత, అణగారిన వర్గాల ఆరాధ్యనేత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని నిండు మనసుతో నివాళులు అర్పిస్తున్నానని జగన్ ట్వీట్ చేశారు.
Jagan
Ambedkar
Jayanthi
Andhra Pradesh

More Telugu News