kcr: ఎక్కువ కేసులు నమోదవుతున్న జీహెచ్ఎంసీపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: సీఎం కేసీఆర్ ఆదేశాలు

  • రాష్ట్రంలో ఇవాళ మరో 32 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
  • వీటితో కలిపి మొత్తం 536 కేసులు
  • 17 జోన్లు గా విభజించి ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలి
CM Kcr conducts review meeting on corona and lock down situations

తెలంగాణలో ‘కరోనా’, లాక్ డౌన్ పరిస్థితులపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రగతిభవన్ లో నిర్వహించిన ఈ సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమీక్షకు ముందు కేసీఆర్ తన చేతులను శానిటైజర్ తో శుభ్రం చేసుకున్నారు. ఫేస్ మాస్క్ కూడా ధరించారు. అనంతరం, ఆయన సమీక్షకు ఉపక్రమించారు.

తెలంగాణలో ఇవాళ మరో 32  కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, వీటితో కలిపి మొత్తం 536 కేసులు నమోదైనట్టు కేసీఆర్ తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని, ఈ విషయమై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

హైదరాబాద్ నగరంలోని 17 సర్కిళ్లను 17 జోన్లుగా విభజించి ప్రత్యేక అధికారులను నియమించడం ద్వారా పూర్తి స్థాయి పర్యవేక్షణ సాధ్యమవుతుందని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖతో పాటు రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ శాఖల అధికారులను కూడా ఆయా జోన్లకు నియమించాలని, ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు. లాక్ డౌన్ ను పొడిగించిన నేపథ్యంలో ప్రజలంతా తమ ఇళ్లకే పరిమితం కావాలని కోరారు.

More Telugu News