Belarus: 1000 మంది ప్రేక్షకులతో ఫుట్ బాల్ మ్యాచ్... ఓ చిన్నదేశం మొండివైఖరి!

  • యూరప్ వ్యాప్తంగా నిలిచిపోయిన ఫుట్ బాల్ లీగ్ పోటీలు
  • బెలారస్ మాత్రం సాకర్ లీగ్ నిర్వహిస్తున్న వైనం
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ విజ్ఞప్తులు సైతం బేఖాతరు
Belarus still continues its premiere foot ball league despite corona fears

ఇప్పటి పరిస్థితుల్లో 10 మంది గుమికూడినా కరోనా భయం వెన్నాడుతూనే ఉంటుంది. అలాంటిది యూరప్ లోని ఓ చిన్నదేశం బెలారస్ ఇప్పటికీ ఫుట్ బాల్ లీగ్ నిర్వహిస్తూనే ఉంది. తాజాగా జరిగిన ఓ మ్యాచ్ కు 1000 మంది ప్రేక్షకులు హాజరవడమే కాదు, చప్పట్లు కొడుతూ, గోల్ నమోదైనప్పుడల్లా పక్కనున్నవారిని హత్తుకోవడం అంతర్జాతీయ సమాజాన్ని విస్మయానికి గురిచేస్తోంది.

కరోనా చైనాను దాటి వెలుపలికి వచ్చిన తర్వాత యూరప్ లో ప్రముఖ ఫుట్ బాల్ లీగ్ లన్నీ నిలిచిపోయాయి. ఒక్క బెలారస్ దేశంలో మాత్రం టాప్ ఫ్లయిట్ లీగ్ ఇప్పటికీ జరుగుతోంది. కరోనా మహమ్మారి ప్రబలే ప్రమాదం ఉందన్న నేపథ్యంలో మ్యాచ్ లు వాయిదా వేయాలని డిమాండ్లు వస్తున్నా టోర్నీ నిర్వాహకులు మాత్రం మొండిగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ వైఖరి కూడా అలాగే ఉంది.

అలాగని బెలారస్ లో కరోనా కేసులు లేవా అంటే అదేమీ కాదు. ఇప్పటికే అక్కడ 2,919 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 29 మరణాలు సంభవించాయి. కరోనా వ్యాప్తి కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ మొత్తుకుంటున్నా బెలారస్ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడంలేదు.

ఇక ఈ దేశాధ్యక్షుడి గురించి కూడా చెప్పుకోవాలి. కరోనా అనేది కేవలం 'మానసికపరమైన వ్యాకులత' మాత్రమేనని, ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు లాక్ డౌన్ అనవసరమని పేర్కొన్నారు. "కరోనాపై పోరాటానికి లాక్ డౌన్ ప్రకటిస్తే ఏమొస్తుంది... ఆర్థిక నష్టం తప్ప! హాయిగా వోడ్కా తాగండి, లేకపోతే ట్రాక్టర్లు నడుపుతూ ఆస్వాదించండి" అంటూ దేశ ప్రజలకు సూచించారు.

  • Loading...

More Telugu News