తెలంగాణలో పది లక్షల మాస్కులు ఉచితంగా పంపిణీ చేస్తాం: బీజేపీ నేత బండి సంజయ్

13-04-2020 Mon 19:24
  • లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజల కోసం అనేక కార్యక్రమాలు  చేస్తున్నాం
  • మా ప్రతి కార్యకర్త ఐదుగురికి భోజనాలు పెడుతున్నారు
  •  బీజేపీ కార్యకర్తలు రక్తదానం చేసేందుకు సిద్ధం 
Bandi Sanjay says we will distribute 10 laks masks to poor people

లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నామని, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపు మేరకు తమ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త ఐదుగురు పేదలకు భోజనాలు పెడుతున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సికింద్రాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాస్క్ ల తయారీపై డెమో కార్యక్రమాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ, డ్వాక్రా మహిళలు, మహిళా కార్యకర్తలతో మాస్క్ లు తయారు చేయిస్తున్నామని, బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల మాస్కులు ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. బస్తీల్లోని పేదలకు ఈ మాస్క్ లు అందజేస్తామని అన్నారు. బీజేపీ కార్యకర్తలు రక్తదానం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని,  రక్తం అవసరం ఉన్న వారు తమ కార్యకర్తలను లేదా నేతలను  సంప్రదించాల్సిందిగా కోరారు.