Corona Virus: ఇండియాలో కరోనాపై తాజా అప్ డేట్స్

Indias latest updates on corona
  • 24 గంటల్లో కొత్తగా 796 కేసులు
  • 34 మంది మృతి
  • ఇప్పటి వరకు 2,06,212 కోవిడ్ టెస్టులు

భారత్ లో గత 24 గంటల్లో కొత్తగా 796 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. చికిత్స పొందుతూ 34 మంది మరణించారని వెల్లడించింది. మొత్తం కేసుల సంఖ్య 9,152కు పెరిగిందని తెలిపింది. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. మొత్తం మృతుల సంఖ్య 308కి పెరిగిందని చెప్పారు. నిన్నటి వరకు 2,06,212 టెస్టులు చేసినట్టు చెప్పారు. లాక్ డౌన్ నిబంధనలను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి అన్ని రాష్ట్రాలు శ్రమిస్తున్నాయని హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాత్సవ తెలిపారు.

  • Loading...

More Telugu News