Anasuya: ఈ కష్టకాలంలో రైతుకి అండగా ఉందామంటున్న యాంకర్ అనసూయ

Anchor Anasuya tweet
  • ‘కరోనా’  పరిస్థితుల నేపథ్యంలో రైతుకి అండగా ఉందాం
  • మామిడి, అరటి, బత్తాయి పండ్లను కొనుక్కుని తిందాం
  • రైతును, దేశాన్ని కాపాడుకుందాం
ప్రస్తుత సంక్షోభ సమయంలో రైతులను ఉద్దేశించి ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది. ఈ కష్టకాలంలో రైతుకి అండగా ఉందామంటూ తన పోస్ట్ లో అనసూయ పేర్కొంది. దేశానికి వెన్నెముక రైతు అని, ‘కరోనా’ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో రైతుకి మనందరం అండగా నిలుద్దామని పిలుపు నిచ్చింది.

రైతు పండించే మామిడి, అరటి, బత్తాయి, నిమ్మ, జామ పండ్లను కొనుక్కుని తిందామని, రోగ నిరోధక శక్తిని పెంచుకుందామని, ఆరోగ్యాన్ని పరిరక్షించుకుందామని సూచించింది. రైతును, దేశాన్ని కాపాడుకుందామని, రైతుకు మనం, మనకు రైతు అవసరమని, మనందరం దేశానికి అవసరమని, ఈ విషయాన్ని మర్చిపోకుండా అందరూ ఇంట్లోని సురక్షితంగా ఉండాలని సూచించింది.
Anasuya
Anchor
Artist
Corona Virus
farmer

More Telugu News